ఢిల్లీ అల్లర్ల కేసులో కార్యకర్తల బెయిల్ రద్దు చేయలేం

ఢిల్లీ అల్లర్ల కేసులో కార్యకర్తల బెయిల్ రద్దు చేయలేం

బెయిల్ పై విడుదలైన విద్యార్థి నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తల బెయిల్ ను రద్దు చేయలేమని.. వారు జైలు బయటే ఉంటారని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక ఆందోళనలు, ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి నటాషా నర్వాల్, దేవాంగన కలీతా, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 

అయితే..ఆ తీర్పును ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దేశమంతటా ఈ కేసు ప్రభావం ఉంటుందన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటూ కేసును విచారణకు స్వీకరిస్తున్నామని సుప్రీంకోర్టు తెలపింది.. అందులోని న్యాయపర అంశాలను పరిశీలించేందుకు అంగీకరిస్తున్నామని.. వచ్చే నెలలో కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే, భవిష్యత్ కేసులకు సంబంధించి UAPAని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని ఢిల్లీ పోలీసులకు సూచించింది.

హైకోర్టు వ్యాఖ్యలపై తాము సంతృప్తిగా లేమని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. ఇలాంటి సున్నితమైన కేసులో వారికి బెయిల్ ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమని.. అందుకే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని చెప్పారు.