బాలీవుడ్ హీరోయిన్ ..హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. అలాగే ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మూడు రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏక సభ్య ధర్మాసనం ఆదేశించింది. రియాకు ప్రొటెక్షన్ కల్పించేందుకు కోర్టు నిరాకరించడంతో బీహార్ పోలీసులు ఏ సమయంలోనైనా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది. సుశాంత్ మృతి కేసులో పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలంటూ రియాచక్రవర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
