అర్నాబ్ కేసు సీబీఐకి ట్రాన్ ఫర్ చేసేందుకు నో చెప్పిన సుప్రీం

అర్నాబ్ కేసు సీబీఐకి ట్రాన్ ఫర్ చేసేందుకు నో చెప్పిన సుప్రీం

న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి పై నమోదైన కేసును సీబీఐకి ట్రాన్ ఫర్ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబై పోలీసులే కేసు దర్యాప్తు కొనసాగించాలని తెలిపింది. పాల్ఘర్ లో సాధువులపై జరిగిన దాడి విషయంలో సోనియాగాంధీపై అర్నాబ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పై కేసు నమోదైంది. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ నేతలు అర్నాబ్ పై ఫిర్యాదు చేయగా వాటిన్నింటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాగ్ పూర్ ల్ దాఖలైన కేసును ముంబైకి ట్రాన్ ఫర్ చేసింది. ఈ కేసులో పోలీసులు ఇదివరకే దాదాపు 12 గంటల పాటు అర్నాబ్ ను విచారించారు. పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కేసును సీబీఐకి ట్రాన్ ఫర్ చేయాలంటూ అర్నాబ్ సుప్రీం ను ఆశ్రయించారు. కేసు విచారించిన సుప్రీంకోర్టు అందుకు నో చెప్పింది. ఐతే అర్నాబ్ ను అరెస్ట్ చేయకుండా మూడు వారాల పాటు రక్షణ కల్పించింది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ అర్నాబ్ ఆరోపించారు.