6 రాష్ట్రాల పిటిషన్ కొట్టివేత.. NEET, JEE పరీక్షలు యధాతథం

6 రాష్ట్రాల పిటిషన్ కొట్టివేత.. NEET, JEE పరీక్షలు యధాతథం

NEET, JEE పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం,సెప్టెంబర్-4) తీర్పునిచ్చింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. NEET, JEE పరీక్షలు వాయిదా వేయాలంటూ 6 రాష్ట్రాలు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. అయితే  ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరుగనున్నాయి.

ఈనెల 13న  NEET ఎగ్జామ్ జరగనుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో… పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు గత నెలలో ఆందోళన చేశాయి. అయితే ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకే కేంద్రం కట్టుబడి పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించడంతో ఎంట్రన్స్ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి.