
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఆమె మోచి కుల ధ్రువీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని పేర్కొంటూ హైకోర్టు సర్టిఫికెట్‌ను రద్దు చేయగా, ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
జస్టిస్ జెకె మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంఎస్ రాణాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా ఊరట లభించడంతో నేడు అమరావతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ స్థానంనుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన నవనీత్ రాణా ఇటీవలే బీజేపీలో చేరారు.
కాగా మహారాష్ట్రలోని 48 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13 , మే 20వతే దీలలో ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికలలో పోటీ చేసిన 25 స్థానాల్లో బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించింది.