రైతుల నిరసనను అడ్డుకోలేం

రైతుల నిరసనను అడ్డుకోలేం

రైతుల నిరసనను అడ్డుకోలేమని, వారికి నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపింది సుప్రీం కోర్టు. కమిటీలో వ్యవసాయంపై అవగాహన ఉన్న స్వతంత్ర సభ్యులు ఉండాలంది. గురువారం ఇరు పక్షాల వాదనలు వినాలని…  ఆ తర్వాత పరిష్కారం సూచిస్తూ కమిటీ ఒక నివేదికను సమర్పించాలని తెలిపింది. కేంద్ర వైఖరితో సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదని, దీనిపై దేశవ్యాప్తంగా రైతు నేతలతో కూడిన కమిటీ వేయాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌ బుధవారం తెలిపింది. ప్రతి నిబంధనపై చర్చలు జరుపుతామన్న కేంద్రం వాదనపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీర్మానాలను రైతులు అంగీకరిస్తారని తాము భావించడం లేదని.. కమిటీ నిర్ణయం తీసుకుందామని ధర్మాసనం తెలిపింది.