కరోనాతో అనాథలైన చిన్నారులను ఆదుకోండి

కరోనాతో అనాథలైన చిన్నారులను ఆదుకోండి
  • రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా బారిన పడి తల్లిదండ్రులను పొగొట్టుకున్న పిల్లలను వెంటనే గుర్తించి, వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇంత పెద్ద దేశంలో తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మరారో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని పేర్కొంది. అలాంటి పిల్లల వేదనను అర్థం చేసుకోని వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది. తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించింది. అనాథ పిల్లల డేటాను పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్​సీపీసీఆర్) వెబ్​సైట్​లో శనివారం సాయంత్రంలోగా రికార్డు చేయాలని జిల్లా అధికారులను న్యాయమూర్తి జస్టిస్​ ఎల్​ఎన్​రావు, న్యాయమూర్తి జస్టిస్​ అనిరుద్ధ బోస్ ల బెంబ్​​ఆదేశించింది. కరోనా కారణంగా అనాథలైన పిల్లలను గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుతూ పెండింగ్​లో ఉన్న సుమోటో కేసులో గౌరవ్​ అగర్వాల్​ దాఖలు చేసిన అమికస్​ క్యూరీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనాథలైన పిల్లల సమాచారాన్ని తమకు తెలపాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఒక్క మహారాష్ట్రలోనే 2,900 మంది పిల్లలకుపైగా అనాథలయ్యారని, వారి తల్లిదండ్రులు కరోనాతో మరణించారని తాము ఎక్కడో చదివినట్లు బెంచ్​ గుర్తుచేసింది. తమకు కచ్చితమైన నంబర్​ తెలియకపోయినా ఇంతకంటే ఎక్కువ మందే ఉంటారని పేర్కొంది.