నేరాలు చేసే టెక్నాలజీ ఉందంటే.. ఆపేది ఎందుకుండదు?

నేరాలు చేసే టెక్నాలజీ ఉందంటే.. ఆపేది ఎందుకుండదు?

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాలపై మూడో వారాల్లోగా అఫిడవిట్ ను దాఖలు చేయాలని కోరింది.

సోషల్‌ మీడియాకు సంబంధించి  హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టు కాని  ఒక విధానాన్ని రూపొందించలేవని, అది ప్రభుత్వం చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఆన్ లైన్ లో జరిగే మోసాలను, నేరాలను ట్రాక్ చేసేందుకు, వాటిని అరికట్టేందుకు  సరైన టెక్నాలజి లేదని సాకులు చెప్పొద్దని సుప్రీం ప్రభుత్వానికి సూచించింది.అలాంటి నేరాలు చేసే టెక్నాలజీ ఉందంటే.. దాన్ని అడ్డుకునే టెక్నాలజీ కూడా ఉండే ఉంటుంది కదా అంటూ కేంద్రానికి చురకలంటించింది.