ఎలక్షన్ కమీషన్ పై సుప్రీం సీరియస్

ఎలక్షన్ కమీషన్ పై సుప్రీం సీరియస్

కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా) తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు పార్టీలకి చెందిన నేతలు ఎన్నికల వేళ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నా.. వారిపై చర్యలు తీసుకోలేక పోతున్నారని పేర్కొంది. ఎలక్షన్ కమిషన్ కి అధికారాలు తక్కువగా ఉండటంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.  రూల్స్ ను అతిక్రమించిన వారి విషయంపై రేపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశించింది. మాయావతి, యోగి అదిత్యానాథ్ చేసిన కామెంట్స్‌ను కోర్టు  ప్రస్తావించింది.