టీవీల్లో విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం సీరియస్

టీవీల్లో విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం సీరియస్

టీవీ ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, విద్వేష ప్రసంగాలను సహించేదిలేదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని ఆపాల్సిన బాధ్యత టీవీ యాంకర్లదేనని తేల్చి చెప్పింది. విదేశాల్లో విద్వేష ప్రసంగాలు ప్రసారం చేస్తే జరిమానా విధించడంతో పాటు ప్రసారాలను నిలిపివేస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి ప్రసంగాలను అరికట్టేందుకు కఠిన నియంత్రణ అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

విద్వేష ప్రసంగాలపై కేంద్రం మౌనంగా ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇదేమైనా చిన్న విషయమా అని ప్రశ్నించింది. ఈ అంశంలో కేంద్రం ప్రతివాదిలా వ్యవహరించకుండా కోర్టుకు సాయం చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది. ఆ లోపు విద్వేష ప్రసంగాల నియంత్రణపై లా కమిషన్ ఇచ్చిన సూచనలపై తన వైఖరేంటో చెప్పాలని న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.