ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు షాక్

ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు షాక్

కోర్టు ధిక్కారం కేసులో..

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థపై లాయర్ ప్రశాంత్ భూషణ్ చేసిన కామెం ట్స్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసిం ది. సుప్రీంకోర్టు జడ్జిలలో 16 మంది అవినీతిపరులంటూ ఆయన చేసిన కామెంట్స్ కంటెంప్ట్​ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తాయా లేదా అనేది తేల్చేందుకు మరో వాయిదా అవ సరమని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్​ అరుణ్ మిశ్రా, జస్టిస్​ బి ఆర్ గవాయి, జస్టిస్​ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. ప్రశాంత్ భూషణ్ తోపాటు ఇదే కేసులో జర్నలిస్ట్​ తరుణ్ తేజ్ పా ల్ పైనా విచారణ జరుగుతోంది. 2009లో ఓ మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ యాక్టివిస్ట్​ లాయర్ ప్రశాంత్ భూషణ్ జడ్జిలపై అభ్యం తరకర కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రశాం త్ భూషణ్ తో పాటు మేగజైన్ ఎడిటర్, జర్నలిస్ట్​ అరుణ్ మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న ఈ కేసును విచారిం చిన బెంచ్.. ఈ నెల 5న తీర్పును రిజర్వ్​ చేసింది. అయితే, తన కామెంట్స్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమిం చాలంటూ ప్రశాంత్ భూషణ్ కోరారు.