మీ నేతల విగ్రహాల కోసం జనం సొమ్మెందుకు..? తమిళనాడు సర్కారుపై సుప్రీంకోర్టు మండిపాటు

మీ నేతల విగ్రహాల కోసం జనం సొమ్మెందుకు..? తమిళనాడు సర్కారుపై సుప్రీంకోర్టు మండిపాటు

చెన్నై: మీ నేతల విగ్రహాల ఏర్పాటుకు ప్రజాధనాన్ని ఎందుకు వాడుతున్నారని తమిళనాడు సర్కారుపై సుప్రీంకోర్టు మండిపడింది. తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే నేత కరుణానిధి విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌‎ను తప్పుపట్టింది. దీనిపై జస్టిస్ విక్రమ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌, జస్టిస్‌‌‌‌‌‌‌ప్రశాంత్​కుమార్​మిశ్రతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘దీనికి అనుమతి లేదు. మీ మాజీ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారు?” అని ప్రశ్నించింది. 

తిరునెల్వేలి జిల్లా మెయిన్ రోడ్‌‌‌‌‌‌‌‌లోని వల్లియూర్ డైలీ వెజిటెబుల్ మార్కెట్ ప్రజా ఆర్చ్ ప్రవేశ ద్వారం దగ్గర కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను తోసిపుచ్చింది.