కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్వయసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మళ్లీ ఆర్డర్స్ ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పింది. అగ్రి చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది.  సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు. కమిటీలో వ్యవసాయ శాస్త్రవేత్తలు,ఎకనమిస్టులు అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ దనావత్, హర్ సిమ్రత్ మన్ ఉన్నారు.

ఈ కమిటీ ముందు రైతులు తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. పరిష్కారం కావాలనుకునే వారు కమిటీని సంప్రదించాలన్నారు. కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదన్న సుప్రీంకోర్టు…. నివేదిక రూపొందించేందుకేనని స్పష్టం చేసింది. చట్టాలను తాత్కాలికంగా నిలిపేసే అధికారం కూడా తమకు ఉందని తెలిపింది. రైతులు నిరవధిక నిరసన చేసుకోవచ్చన్నారు. ఇవి రాజకీయాలు కాదని… న్యాయవాదులు తమకు అనువుగా వాదన మార్చుకోవడం సరికాదని  చెప్పింది. కేవలం వ్యతిరేకాంశాలను మాత్రమే చెప్పడం సరికాదని… సానుకూలాంశాలను కూడా చెప్పాలని సూచించింది.