అక్టోబరు 18 లోపు అయోధ్య కేసు వాదనలు క్లోజ్

అక్టోబరు 18 లోపు అయోధ్య కేసు వాదనలు క్లోజ్

న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి కోసులో వాదనలను అక్టోబరు 18 లోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రోజువారీ విచారణలో భాగంగా ఇవాళ వరుసగా 26వ రోజు వాదనలు జరిగాయి.

నేటి విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిర్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసు ముగింపు దిశగా కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టబరు 18 కల్లా విచారణ కూడా పూర్తి చేయాలని పిటిషనర్లందరికీ సూచించింది. ఉమ్మడిగా కృషి చేసి ఈ కేసును పరిష్కరిద్దామని సీజేఐ సూచించారు.

అయితే ఈ లోపు మధ్యవర్తులు కూడా సంప్రదింపులు కొనసాగించవచ్చని చెప్పారు. వారు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటే దాన్ని కోర్టు ముందు పెట్టొచ్చని అన్నారు. నవంబరు 17న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ రిటైర్ కాబోతున్నారు. ఆ లోపు ఆయోధ్య కేసులో తుది తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది.