ఆక్సిజన్ పంపిణీకి నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ

ఆక్సిజన్ పంపిణీకి నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ

కరోనా కట్టడికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.దేశంలో వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరాను గమనించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్... 12 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. శాస్త్రీయంగా, పక్షపాతం లేకుండా ఆక్సిజన్ సరఫరా జరగడాన్ని టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. అలాగే రాష్ట్రాలకు అవసరమైన మెడిసిన్ ను సైతం సమానంగా  పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీదే.