
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం VVPATల స్లిప్పులను లెక్కించాలనే అంశంపై దేశంలోని 21 పార్టీలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ అంశంపై రివ్యూ పపిటిషన్ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరగనుంది.