SC,ST చట్టం సమీక్షకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

SC,ST చట్టం సమీక్షకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

SC,ST అత్యాచారాల నిరోధక చట్టం సమీక్షించాలన్న ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీంకోర్టు అనుమతించింది. ఇద్దరు న్యాయమూర్తులు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ ముగ్గురుసభ్యులున్న ధర్మాసనం రాజ్యాంగపరిధిలో ఈ చట్టానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడానికి వీలుల్లేదని తేల్చి చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు SC,ST కులాలకు సంబంధించి ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని, అలాగే ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగంచేస్తున్నారని కూడా తెలిపింది. అయితే దుర్వినియోగంచేస్తున్నారన్న అభియోగాలపై ఈ చట్టం మార్గదర్శకాలను నిర్వీర్యం చేయడానికి వీలులేదని చెప్పింది. గతేడాది సుప్రీం ఇద్దరు సభ్యుల బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. SC,ST చట్టం పరిధిలో ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్టు చేసేందుకు వీలులేదని సమగ్ర విచారణ తర్వాత మాత్రమే అరెస్టులు నిర్వహించాల్సి ఉందని వెల్లడించిన తీర్పుపై అప్పుడు జరిగిన నిరసనపై ప్రభుత్వం చట్టం సవరణలు చేసేందుకు వెనక్కి తగ్గింది. సుప్రీం తీర్పుప్రకారం చట్టానికి సవరణలు తీసుకువస్తున్నదన్న సమాచారంతో దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు జరిగాయి.

నిరసనలతో అప్పట్లో ప్రభుత్వం వెనక్కితగ్గింది. వెనువెంటనే సుప్రీంలో పిటిషన్‌దాఖలుచేసి SC,ST  చట్టాన్ని సమీక్షించాలని అభ్యర్ధనను దాఖలు చేసింది.