భారత సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది. ప్రధాన న్యాయమూర్తి కాకుండా మిగతా జడ్జీల సంఖ్య 30 నుంచి 33కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్జీల సంఖ్య పెంచాలంటే.. అందుకు పార్లమెంట్ అనుమతి అవసరం. అందుకే.. ఎన్డీయే ప్రభుత్వం… సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును రూపొందిస్తోంది. ఈ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ గడప దాటించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ను జూన్ 17 నుంచి జులై 26 వరకు షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత ఆగస్ట్ 7 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
