
- బీజేపీ ఫాసిస్టు ధోరణులపై పోరాడిన మహానీయుడు
హైదరాబాద్, వెలుగు: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నిత్య అధ్యాయన శీలుడు, ప్రజా పోరాట యోధుడని పలువురు వక్తలు కొనియాడారు. బంజారాహిల్స్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పంజలి ఘటించారు.
అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో సురవరం సుధాకర్‌రెడ్డి అగ్రగణ్యుడని తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఎంపీగా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాల తరలింపు ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. జస్టిస్ చంద్ర కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు