సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్.. ఏజెంట్ x ధృవ మూవీస్ కి లింక్?

సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్.. ఏజెంట్ x ధృవ మూవీస్ కి లింక్?

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్స్ ట్రేడ్ నడుస్తోంది. హాలీవుడ్ లో ఈ ఆనవాయితీ ఎప్పటినుంచో ఉన్నా.. ఇండియన్ సినిమాలో మాత్రం ఈమధ్యే స్టార్ట్ అయ్యింది. అది కూడా లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ మూవీతో. ఈ సినిమాతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాను డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలకి లింక్ చేసి.. సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసాడు.

ఇక అప్పటినుండి ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలకి ఈ సినిమాటిక్ యూనివర్స్ ని  క్రియేట్ చేసి ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా వచ్చినవే.. హిట్, హిట్2 సినిమాలు. ఇక తాజాగా వచ్చిన బాలీవుడ్ మూవీ పఠాన్ లో కూడా సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ మూవీకి లింక్ చేసి కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు. నిజానికి ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది ప్రేక్షకులకి ఒక కొత్త రకం అనుభూతే. ఒకే సినిమాలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది హీరోలు కనిపించడం అనేది ఎప్పటికీ ఎగ్జైటింగానే ఉంటింది.

ఇక తాజాగా టాలీవుడ్ లో మరో మూవీకి కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ మూవీని రామ్ చరణ్ నటించిన ధ్రువ మూవీతో లింక్ చేశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ రెండు సినిమాలని డైరెక్ట్ చేసింది కూడా సురేందర్ రెడ్డినే. తాజాగా ఏజెంట్ మూవీ ప్రేమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. ఈ వీడియోలో ధ్రువలో రామ్ చరణ్, ఏజెంట్ మూవీలో అఖిల్ కి సహాయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసిన మెగా, అక్కినేని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మరి ఇదే గనక నిజమై.. ఏజెంట్ మూవీలో రామ్ చరణ్ కనిపిస్తే.. సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయం. మరి నిజంగా ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.