Suresh Raina: రైనా మెచ్చిన టాప్-3 టీ20 బ్యాటర్స్ వీరే.. అగ్రస్థానంలో సన్ రైజర్స్ ప్లేయర్

Suresh Raina: రైనా మెచ్చిన టాప్-3 టీ20 బ్యాటర్స్ వీరే.. అగ్రస్థానంలో సన్ రైజర్స్ ప్లేయర్

టీ20 క్రికెట్ లో విధ్వంసకర ప్లేయర్స్ అంటే లిస్ట్ చాలానే ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ లో ఇన్నోవేటివ్ షాట్స్ తో బ్యాటర్స్ ఓ రేంజ్ లో చెలరేగుతున్నారు. ఒకప్పుడు విధ్వంసం అంటే గేల్, మెక్ కలం, ఏబీ డివిలియర్స్ లాంటి కొంతమంది పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు ఒకరి పేరు చెప్పడం చాలా కష్టం. కనీసం టాప్-3 ని ఎంచుకోవాలంటే కూడా కష్టంగా మారుతుంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో తన టాప్-3 బ్యాటర్లను ఎంచుకున్నాడు. వీరిలో ఒకరు సౌతాఫ్రికా క్రికెట్ స్టార్, ఇద్దరు ఇండియన్ క్రికెటర్లు ఉండడం ఉన్నారు.   

శుభంకర్ మిశ్రాతో పాడ్‌కాస్ట్‌లో రైనా మాట్లాడుతూ.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్‌ ను తన టాప్ టీ20 బ్యాటర్ గా చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ, టీమిండియా టీ20 కెప్టెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లను రెండు, మూడు స్థానాలకు ఎంపిక చేశాడు. క్లాసెన్ అరుదైన సిక్స్-హిట్టింగ్ సామర్ధ్యం మిగిలిన వారి నుండి వేరు చేస్తోందని రైనా హైలైట్ చేశాడు. క్లాసన్ ఇటీవలే టీ20 క్రికెటర్లలో అత్యంత ప్రమాదకర బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సఫారీ బ్యాటర్ ను  ఏకంగా రూ. 23 కోట్ల రూపాయలను ఇచ్చి రిటైన్ చేసుకోవడం విశేషం. 

►ALSO READ | Muhammad Waseem: పసికూన ప్లేయర్ తడాఖా: రోహిత్ శర్మ ఆల్‌టైం రికార్డ్ బద్దలు కొట్టిన UAE కెప్టెన్

పరిమిత ఓవర్ల క్రికెట్ లో తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే క్లాసన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. 33 ఏళ్ళ క్లాసన్  సౌతాఫ్రికా తరపున 58 టీ20ల్లో 1000 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ఇంగ్లాండ్స్ పై కొట్టిన సెంచరీ తనను ఎంతగానో ఇంప్రెస్స్ చేసిందని రైనా చెప్పాడు. సూర్య కుమార్ యాదవ్ కు టీ20 క్రికెట్ లో చాలా రకాల షాట్స్ ఆడగలిగే సామర్ధ్యం ఉందని తెలిపాడు. ప్రస్తుతం సూర్య, అభిషేక్ ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీని తొలిసారి 8 జట్లు ఆడుతున్నాయి.