ఆస్పత్రిలో కోబ్రా పాము డెలివరీ.. ఖాళీ చేసిన డాక్టర్లు, పేషెంట్లు

ఆస్పత్రిలో కోబ్రా పాము డెలివరీ.. ఖాళీ చేసిన డాక్టర్లు, పేషెంట్లు

ఆస్పత్రిల్లో వింత జననాలు, వింత ఘటనలు చూశాం.  ఎలుకలు కొరికాయని.. బొద్దింకలు తిరుగుతున్నాయని, ఈగలు దోమలు, పాములు తిరుగుతున్నాయనే వార్తలు కూడా విన్నాం.  కాని ఇప్పడు ప్రెగ్నెట్ స్నేక్ వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిందేమో తెలియదు కాని .. ఓ వైద్యశాలలో ఏకంగా 10 పిల్లలకు జన్మనిచ్చింది.   సర్జికల్ వార్డులో మూడు రోజుల్లో 10 పామలు కనిపించడంతో పేషంట్లు, డాక్టర్లు పరార య్యారు.  

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా ఆస్పత్రి సర్జికల్ వార్డులో కోబ్రా స్నేక్స్ కలకలం సృష్టించాయి. మూడు రోజుల్లో పది నాగు పాము పిల్లల సంచారాన్ని గమనించిన సిబ్బంది.. పేషంట్లు పరుగులు పెట్టారు.  వెంటనే ఈ వార్డులో ఉన్న ఎనిమిది మంది  రోగులను మరో వార్డుకు తరలించారు. 
సర్జికల్ వార్డు పరిసర ప్రాంతాల్లో ముళ్ల పొదలు, చెట్లు ఉన్నాయి.  అంతేకాక ఇక్కడున్న ఫ్లోరింగ్ కూడా దెబ్బతిని ఇసుక రాళ్లు బయటకు వచ్చాయి.  దీంతి దెబ్బతిన్న ప్రదేశం నుంచి పాములు లోపలకు వెళ్లాయని అక్కడున్న వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  అక్కడి నుంచి నిదానంగా వార్డు రూంలోకి వెళ్లాయని అంటున్నారు.  గతంలో కన్నూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గర్భిణీ కుమార్తెతో పాటు 55 ఏళ్ల మరో మహిళ పాముకాటుకు గురవడంతో ఇద్దరు మరణించారు. 

పేదలకు అదిచేస్తాం.. ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సర్జికల్ వార్డుల్లో కూడా పాములు సంచరిస్తున్నాయంటే.. ప్రభుత్వాలకు ప్రజల పట్ల ఏమేరకు చిత్తశుద్ది ఉందో కళ్లకు కట్టినట్టు కనపడుతుంది. ఇంకా దేశంలో ఇలాంటి ఆస్పత్రులు ఎన్ని ఉన్నాయో గుర్తించి తక్షణమే పరిసరాలను శుభ్రమపరచి.. మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.