కొత్త మూవీ కోసం హీరో సూర్య పాతికేళ్లు వెనక్కి

కొత్త మూవీ కోసం హీరో సూర్య పాతికేళ్లు వెనక్కి

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య.. క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం ‘కంగువా’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు సూర్య. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ పూర్తయ్యాక సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో సూర్య పాత్రకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది.

ఇప్పటివరకూ తన వయసుకు మించిన పాత్రలెన్నో చేసిన సూర్య.. ఇందులో మాత్రం తనకంటే చిన్న వయసు పాత్ర పోషించాల్సి ఉందట. ప్రస్తుతం తన వయసు నలభై ఎనిమిది కాగా, పాతికేళ్ల వయసు తగ్గించుకుని కాలేజీ స్టూడెంట్‌‌‌‌గా కనిపిస్తాడట. సినిమాకు ఎంతో కీలకమైన సీన్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో యంగ్‌‌‌‌గా కనిపించేందుకు బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యాడట.

ఇక ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత సూర్య, సుధా కొంగర కాంబినేషన్‌‌‌‌లో రాబోయే సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది. దుల్కర్ సల్మాన్, నజ్రియా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.