
బ్యూనస్ ఎయిర్స్: ఇండియా షూటర్ సురుచి సింగ్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. మంగళవారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 18 ఏళ్ల సురుచి 244.6 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. చైనా ద్వయం క్వియాన్ వీ (241.9), జియాంగ్ రాంక్సిన్ (221) వరుసగా సిల్వర్, బ్రాంజ్ మెడల్‌ను సాధించారు.