శివ్వంపేట మండలంలో రింగ్ రైల్వే లైన్ కోసం సర్వే

శివ్వంపేట మండలంలో రింగ్ రైల్వే లైన్ కోసం సర్వే

శివ్వంపేట, వెలుగు : రీజినల్ రింగ్ రోడ్డు మాదిరిగానే దాని పక్కనుంచి రింగ్ రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సర్వే ప్రారంభమైంది. శివ్వంపేట  మండలంలోని కొంతన్ పల్లి, పోతులగూడ గ్రామాల్లో ట్రిపుల్​ఆర్ పక్క నుంచి మార్కింగ్ ఇస్తూ సర్వే నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే ట్రిపుల్​ ఆర్ లో భూములు కోల్పోయి నష్టపోయామని, మళ్లీ రైల్వే లైను కోసం ఎంత భూమి పోతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ ఆఫీసర్లను సంప్రదిస్తే రింగ్ రైల్వే లైన్ కు  సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా రైల్వే లైన్ కోసం సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం.