పర్యావరణ సంక్షోభం తొలగాలంటే వాతావరణ సాంకేతికత చాలా అవసరం: సర్వేలో వెల్లడి

పర్యావరణ సంక్షోభం తొలగాలంటే వాతావరణ సాంకేతికత చాలా అవసరం: సర్వేలో వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించేందుకు మార్గాలను వెతుకుతున్న క్రమంలో వాతావరణ సాంకేతికత(Climate tech)చాలా అవసరమని సర్వేలో తేలింది. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ఈ సర్వేలో సుస్థిరమైన లక్ష్యాలను సాధించేందుకు అత్యవసరంగా వాతావరణ సాంకేతికత అవసరమని సర్వే తేల్చి చెప్పింది. డీకార్బనైజేషన్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13వందల కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను క్యాప్ జెమినీ రీసెర్చ్ఇన్ స్టిట్యూట్  చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఇన్ స్టిట్యూట్ సర్వే చేసిన మూడొంతుల మంది ఎగ్జిక్యూటివ్ లు వాతావరణ సాంకేతికత లేకుండా తమ స్థిరమైన లక్ష్యాలను సాధించలేమని చెప్పారు. 

క్లైమేట్ టెక్నాలజీని ఉపయోగించాలన్న అసవరంపై నమ్మకం పెరుగుతున్నప్పటికీ దాని సాంకేతికత ఖర్చు ప్రధాన అవరోధంగా ఉందని నివేదికలో పేర్కొంది. క్లైమేట్ టెక్ ఇంటిగ్రేషన్ కోసం గ్రీన్ ప్రీమియంలు  అనగా తక్కువ కార్బన్ ఉత్పత్తులు, వాటి అధిక ఉద్గార ప్రత్యామ్నాయాల మధ్య ధర లో వ్యత్యాసం  చాలా ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. 

క్లైమేట్ టెక్ టెక్ అడాప్షన్ కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది ఎగ్జిక్యూటివ్ లు అభిప్రాయపడ్డారు. 9 శాతం మంది మాత్రం గ్రీన్ ప్రీమియం ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాతావరణ సాంకేతికతలపై కార్పొరేట్ పెట్టుబడులు వచ్చే రెండేళ్లలో 7.7 శాతం వృద్ధి చెందుతాయని సర్వేలో తేలింది. 

తమ సిస్టమ్ లలో క్లైమేట్ టెక్ ని ఏకీకృతం  చేసే కొత్త  వ్యాపార మార్గాలను కంపెనీలు అనుసరించాలని నివేదిక సిఫారసు చేసింది. AI , డిజిటల్ ట్విన్స్,3డి  ప్రింటింగ్ సాంకేతికత వంటి డిజిటల్ సాంకేతిక పరిజ్ణానాన్ని కంపెనీలు ఉపయోగించుకోవాలని సూచించింది. కొత్త ఆవిష్కరణలు, మెరుగుపర్చడానికి , కార్మికుల శిక్షణకు స్టార్టప్ లతో టైఅప్ కావాలని కూడా సర్వే నివేదిక సిఫారస్సు చేసింది.