ప్రాణాలు నిలుపుతున్న‘కాకా’ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్

ప్రాణాలు నిలుపుతున్న‘కాకా’  ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్
  • ప్రాణాలు నిలుపుతున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్
  • కాకా ఫౌండేషన్​ ద్వారా హాస్పిటళ్లకు పంపిణీ

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ కోర్​కమిటీ మెంబర్​ డాక్టర్​ జి.వివేక్ ​వెంకటస్వామి కాకా ఫౌండేషన్​ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్​కు డొనేట్​ చేసిన ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడుతున్నాయి. కరోనా పేషెంట్లకు అండగా నిలిచేందుకు వివేక్​ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్​నియోజకవర్గంలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, గోదావరిఖని, సుల్తానాబాద్, ధర్మపురి హాస్పిటల్స్​కు ఇటీవల ఆరు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు డొనేట్ ​చేశారు. ఇవి కరోనా పేషెంట్లకు ఆక్సిజన్​ అందని ఆపద సమయంలో సంజీవనిలా ఉపయోగపడుతున్నాయి. బెల్లంపల్లి ఐసోలేషన్​సెంటర్​కు డొనేట్​ చేసిన ఆక్సిజన్​ కాన్సంట్రేటర్​ను కరోనా పేషెంట్లకు వినియోగిస్తున్నారు. మంచిర్యాల, చెన్నూర్​ హాస్పిటల్స్​కు ఇచ్చిన పరికరాలను రెండు రోజుల్లో ఇన్​స్టాలేషన్​ చేసి వినియోగంలోకి తీసుకొస్తామని డాక్టర్లు చెప్పారు. 

ఎంతో ఉపయోగపడుతోంది​
కాకా ఫౌండేషన్​ద్వారా బెల్లంపల్లి ఐసోలేషన్​సెంటర్​కు ఇటీవల ఆక్సిజన్​ కాన్సంట్రేటర్​అందజేశారు.ఆక్సిజన్ ​సాచ్యురేషన్​పడిపోతున్న పేషెంట్లకు అత్యవసర సమయాల్లో దీనిని వినియోగిస్తున్నాం. ఈ మిషన్​ బాగా పనిచేస్తోంది. కాకా వెంకటస్వామి ఫౌండేషన్​కు ధన్యవాదాలు. 
- డాక్టర్​ అనిల్, బెల్లంపల్లి ఐసోలేషన్ ​సెంటర్​ ఇన్​చార్జి