
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ సొసైటీ ఫర్ నాన్- డెస్ట్రక్షన్ టెస్టింగ్ (ఐఎస్ఎన్టీ) హైదరాబాద్ చాప్టర్ 2025–26 సంవత్సరానికి తన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. నగరానికి చెందిన పారిశ్రామికవేత్త సూర్యప్రకాశ్ గజ్జల ఈ చాప్టర్కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
డాక్టర్ కోమల్ కపూర్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సూర్యప్రకాశ్ ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓగా పనిచేస్తున్నారు. ఐఎస్ఎన్టీ నాన్- డెస్ట్రక్టివ్ టెస్టింగ్ రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకుల కోసం పనిచేసే లాభాపేక్షలేని,
వృత్తిపరమైన సంస్థ.