
న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో టీమిండియా నడిపించేందుకు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెడీ అవుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సూర్య బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో పాసయ్యాడు. జూన్‌లో సూర్య స్పోర్ట్స్ హెర్నియా గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం సీఓఈలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సర్జరీ తర్వాత నేషనల్ టీమ్‌లోకి తిరిగి ఆటలోకి రావడానికి ఫిట్‌నెస్ టెస్టులు తప్పనిసరి కాగా.. దీన్ని సూర్య క్లియర్ చేశాడు. ఫిట్‌నెస్ సాధించిన టీ20 కెప్టెన్ ఆసియా కప్ టీమ్ ఎంపిక కోసం మంగళవారం ముంబైలో జరగనున్న సెలెక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ జరగనుంది.