హామీల అమలులో కేసీఆర్ ఫెయిల్ : సంకినేని వెంకటేశ్వరరావు

హామీల అమలులో కేసీఆర్ ఫెయిల్ : సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు: రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ హామీల అమలులో ఫెయిల్ అయ్యారని సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. ఆదివారం సూర్యపేటలోని  జమ్మిగడ్డ లో  ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత సీఎం,  మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , ఇంటిజాగా ఉంటే  రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.  

పైగా పేదల ఇండ్ల స్థలాలు, భూములు గుంజుకొని  రైతు వేదికలు , డంపింగ్ యార్డులు నిర్మించారని ఆరోపించారు.  గ్రూప్స్‌‌ పరీక్షలు నిర్వహించకుండానే ప్రశ్నాపత్రాలను  లీక్ చేసి  నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగదీశ్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.  ఇప్పుడు మూడోసారి అవకాశం ఇవ్వాలని ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  బీజేపీ అధికారంలోకి రాగానే  ఏడాదికి ప్రతి 

కుటుంబానికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు, పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అర్హులకు రేషన్ కార్డులు  ఇవ్వడంతో పాటు ఆయుష్మాన్ భారత్  ద్వారా  ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం  కూడకూడ,  బొప్పారం  పీక్ల తండాకు చెందిన దాదాపు 200 మంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో  చేరారు.