సూర్యాపేటలో ఉద్రిక్తత.. భారీగా ట్రాఫిక్ జాం..

సూర్యాపేటలో ఉద్రిక్తత..  భారీగా ట్రాఫిక్ జాం..

సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురుకుల హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వైష్ణవి మృతిపై నిజ నిర్థారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గురుకుల పాఠశాల ముందున్న పెన్ పహాడ్ రహదారిపై బైఠాయించారు కుటుంబ సభ్యులు, బంధువులు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు.

వైష్ణవి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని.. పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజ నిర్థారణ చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో  పెన్ పహాడ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..

సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ST సొషల్ వెల్ఫేర్ బాలికల గురుకల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి చదువుతున్న వైష్ణవి నిన్న రాత్రి డార్మెటరీ హాల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీలో ఫేర్వెల్ పార్టీ పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు అందరూ కాలేజీలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది.