సూర్యాపేట, వెలుగు: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా సూర్యాపేట రూరల్ పరిధిలోని యర్కారం, బాలెంల, రామచంద్రపురం, పిన్నాయి పాలెం, కేసారం, ఇమాంపేట, ఎండ్లపల్లి గ్రామాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా రూరల్ సీఐ రాజశేఖర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. 100 మీటర్ల పరిధిలో నిబంధనలను అమలు చేయాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా ఎవరినీ పంపవద్దన్నారు. నామినేషన్ కేంద్ర అధికారి నిర్ణయాలను అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి ఎన్నికల నియమావళి గురించి అవగాహన కల్పించారు.
