ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం : ఎస్పీ నరసింహ

ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం : ఎస్పీ నరసింహ
  • ఎస్పీ నరసింహ

సూర్యాపేట, వెలుగు: సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌ఎన్నికలకు నోటిఫికేషన్‌‌‌‌ వచ్చిన సందర్భంగా జిల్లాల్లో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే  పోలీస్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌రూం 8712686057 , సోషల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూం 8712686026 నెంబర్లకు, డయల్ 100కు  సమాచారం ఇవ్వాలన్నారు. 

 అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. నవంబర్‌‌‌‌26 పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్‌‌‌‌ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠిక ను చదివి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్‌‌‌‌రెడ్డి, జనార్దన్‌‌‌‌రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహ చారి, స్పెషల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ ఇన్స్‌‌‌‌పెక్టర్ రామారావు, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐలు, పోలీస్‌‌‌‌ సిబ్బంది పాల్గొన్నారు.