గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సర్పంచ్ క్యాండిడేట్‌గా బుడిగె పుల్లమ్మ గురువారం నామినేషన్ వేశారు. డిపాజిట్ కోసం చెల్లించాల్సిన రూపాయి నాణేలు మొత్తం వెయ్యి తీసుకొచ్చి ఆఫీసర్లకు అందజేశారు. ఈ విషయమై మల్లమ్మను అడుగగా.. గ్రామంలోని యూత్ క్లబ్ సభ్యులు చందాలు వేసి తన డిపాజిట్ డబ్బులు అందజేశారని చెప్పారు.
