సుశాంత్ కోసం..

సుశాంత్ కోసం..

సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ సూసైడ్‌‌కి బాలీవుడ్‌‌లో ఉన్న నెపోటిజమే కారణమని కొందరు సెలెబ్రిటీస్ మొదలు సుశాంత్ అభిమానుల వరకూ విమర్శలు చేస్తున్నారు. సుశాంత్‌‌ కెరీర్‌‌ని అణగదొక్కడం కోసం కొందరు బాలీవుడ్ ప్రముఖులు పూనుకున్నారని చాలామంది ఓపెన్‌‌గా చెబుతున్నారు. ఆరు నెలల్లో సుశాంత్ సైన్ చేసిన ఏడు పెద్ద సినిమాలు క్యాన్సిల్ అవ్వడమే అందుకు సాక్ష్యమంటున్నారు. అయితే ఫిల్మీ బ్యా‌‌గ్రౌండ్‌‌ లేకపోవడంతో పాటు సుశాంత్‌‌ బీహారీ వ్యక్తి అవడం వల్లే ఇలా చేశారనే ప్రాంతీయవాదం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఫలితంగా సుశాంత్ మరణానికి కారణమైన వ్యక్తుల సినిమాలను బీహార్లో బ్యాన్‌‌ చేయాలనే నినాదాలు మొదలయ్యాయి. సల్మాన్‌‌ ఖాన్, ఆలియాభట్, సోనమ్ కపూర్‌‌, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తాకపూర్‌‌ లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీల చిత్రాల్ని బ్యాన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే బాలీవుడ్‌‌ సినిమాలకు ఓ మంచి మార్కెట్ మిస్ అయినట్టే. మరోవైపు సుశాంత్ చనిపోయిన రోజును నెపోటిజం డేగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.