కాంగ్రెస్ పార్టీకి సుష్మితా దేవ్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి సుష్మితా దేవ్ రాజీనామా

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లెటర్ పంపారు. అయితే లెటర్ లో తన రాజీనామాకు ఎలాంటి కారణాలు వివరించలేదని తెలుస్తోంది. అస్సాంకు చెందిన సుష్మితా దేవ్... 2011 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 నుంచి 19 వరకు కాంగ్రెస్ లోక్ సభ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2017 సెప్టెంబర్ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ మధ్య ట్విట్టర్ లాక్ చేసిన కాంగ్రెస్ నేతల ఖాతాల్లో సుష్మితా దేవ్ అకౌంట్ కూడా ఉంది. తన ట్విట్టర్ అకౌంట్ బయోలో కూడా మార్పులు చేశారు సుష్మిత. కాంగ్రెస్ మాజీ మెంబర్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలిగా ఛేంజ్ చేశారు.