
మహారాష్ట్రలోని ముంబైలో విచిత్ర సంఘటన.. స్కూటర్ చోరీ చేసి పారిపోతున్న దొంగనుపట్టుకున్న స్థానికులు.. ఆ తర్వాత భోజనం పెట్టి, సిగరెట్ఇచ్చి మర్యాదగా బాయ్ చెప్తూ పోలీసులతో పంపించేశారు. అసలేం జరిగిందంటే..
మంగళవారం(సెప్టెంబర్23) తెల్లవారు జామున ముంబై సమీపంలోని విరార్నగరంలో స్కూటర్ దొంగిలించి పారిపోతున్న ఓవ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. విరార్ప్రాంతంలోని గ్లోబల్ సిటీ పరిధిలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్థానికులు దొంగకు భోజనం పెట్టారు.. తాగడానికి సిగరెట్ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు అప్పించారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
రెడ్ కలర్ స్కూటీని దొంగిలించి పారిపోతుండగా అనుమానం వచ్చిన స్థానికులు దొంగను పట్టుకున్న దృశ్యాలు వీడియోలు కనిపిస్తున్నాయి. దొంగతనం గురించి ఆరా తీస్తుండగా.. చలితో బాగా దొంగ వణికిపోతున్నట్లు కనిపిస్తోంది. సమాధానం చెప్పడంతో తడబడుతుండటంతో గమనించిన స్థానికులు అతనికి భోజనం పెట్టారు..తర్వాత సిగరెట్తాగించారు.
అయితే దొంగతనం జరిగిందా లేదా, దొంగతనం అతనే చేశాడా అనే వివరాలు స్పష్టంగా తెలియదు గానీ దొంగకు భోజనం పెట్టి , ఆ తర్వాత బాయ్ చెప్పి మరీ పోలీసులతో పంపించిన దృశ్యాలు మాత్రం వీడియోలో కనిపించాయి. నిందితుడిపై కేసు నమోదు అయిందా లేదా అతనిపై అధికారికంగా చర్యలు తీసుకున్నారా అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.