పార్లమెంట్ వద్ద సస్పెన్షన్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ వద్ద సస్పెన్షన్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ కు గురైన రాజ్యసభ ఎంపీలు నిరసకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలు సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ రాజ్యసభ వెల్ లోకి విపక్ష ఎంపీలు దూసుకెళ్లారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.