సారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం

సారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం

న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ ఎందుకు  చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చట్టసభల్లో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలా అని క్వశ్చన్ చేశారు. 

కాగా, గత పార్లమెంట్ సెషన్ లో రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలు శృతి మించాయంటూ నిన్న 12 మంది ఎంపీలను చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. సస్పెండ్ అయిన ఎంపీలు క్షమాపణలు చెబితే సభలోకి అనుమతిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కానీ సారీ చెప్పే ప్రసక్తే లేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో స్పష్టం చేశారు. ఎంపీల సస్పెన్షన్ పై స్పీకర్ వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిపక్షాలు రాజ్య సభ, లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. 

మరిన్ని వార్తల కోసం: 

చర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

సీఎం కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలి

గెలవడానికే వచ్చాం.. గెలిచి తీరుతాం