చర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

చర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడీ.. ఎలాంటి చర్చలు జరపకుండానే చట్టాలను రద్దు చేస్తున్నారని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో ఏ విషయంపై అయినా చర్చలకు సిద్ధం అని ప్రధాని మోడీ అన్నారు. కానీ సెషన్స్ ప్రారంభమైన తొలి రోజు అగ్రి చట్టాల బిల్లు మీద చర్చలు జరపకుండానే వాటిని రద్దు చేశారు. ఈ బిల్లులను ప్రవేశ పెట్టినప్పుడు ఇరు పక్షాలు ఒప్పుకోలేదు. అయినా బిల్లులను తీసుకొచ్చారు. అయితే వాటి రద్దుకు ఇరు పక్షాలు అంగీకారం తెలిపినా చర్చ జరగలేదు. ఏదేమైనప్పటికీ చర్చ జరగలేదనేది మాత్రం విస్పష్టం’ అని చిదంబరం ట్వీట్ చేశారు. చర్చలు లేని ఇలాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

గెలవడానికే వచ్చాం.. గెలిచి తీరుతాం

బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ

ఇండియన్స్ వల్ల అమెరికాకు చాలా బెనిఫిట్