
- బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లులకు వడ్లు మళ్లించినట్టు నిర్ధారణ
- రూ.73 కోట్ల విలువైన వడ్లు పక్కదారి
- ఇప్పటికే షకీల్‌పై కేసు నమోదు
నిజామాబాద్, వెలుగు : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నిర్వహణలోని రైస్ మిల్లులకు నిబంధనలకు విరుద్ధంగా సీఎంఆర్ వడ్లు మళ్లించడమే కాకుండా పర్యవేక్షణ లోపంతో గోల్‌మాల్‌కు సహకరించిన ఇద్దరు జిల్లా సివిల్సప్లయీస్ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు పడింది. నిజామాబాద్ డీఎస్ఓ చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రూ.73 కోట్ల విలువ చేసే 37,019 టన్నుల వడ్లు పక్కదారి పట్టడానికి వారే
కారకులని విచారణలో కన్ఫర్మ్ చేసుకున్నాక సర్కారు ఈ యాక్షన్ తీసుకుంది.
37,019 మెట్రిక్ టన్నులు మాయం
బీఆర్ఎస్ గవర్నమెంట్హయాంలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టించిన ఉదంతంపై కాంగ్రెస్ సర్కారు ఎంక్వైరీ చేయించింది. బోధన్ మండలంలోని తగ్గెల్లి గ్రామంలోని అమీర్ ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాహిల్ఫుడ్స్, క్యాటరింగ్, సర్వీసెస్, ధన్విక్ ఆగ్రోమిల్స్, రాన్ ఫుడ్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ (కమ్మర్పల్లి), సైరస్ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో ఐదు రైస్ మిల్లులను షకీల్నడిపారు. 2021–-22 ఖరీఫ్, యాసంగితో పాటు 2022-–23 ఖరీఫ్ ఇలా మొత్తం మూడు సీజన్ల వడ్లు సుమారు లక్ష మెట్రిక్ టన్నులను ఆఫీసర్లు ఆ మిల్లులకు మళ్లించారు. పంపిన వడ్లకు సమానంగా సీఎంఆర్ రైస్ పంపుతున్నారా? లేదా? అనేది మాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక స్టేట్ లెవెల్లో సీఎంఆర్ వడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో షకీల్ నిర్వహణలోని రైస్ మిల్స్ 37,019 మెట్రిక్ టన్నుల వడ్ల బాకీ ఉన్నట్లు గుర్తించింది. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ వింగ్స్‌తో వేరువేరుగా విచారణ చేయించగా రూ.73 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్టు రిపోర్టు ఇచ్చారు.
విచారణాధికారులను తికమకపెట్టే ప్రయత్నం
మాజీ ఎమ్మెల్యే షకీల్ నిర్వహణలోని ఐదు రైస్‌మిల్స్‌కు పంపిన లక్ష మెట్రిక్‌టన్నుల వడ్లలో 37,019 టన్నుల షార్టేజ్ తేలగా కొత్త డ్రామా సృష్టించి విచారణ అధికారులను తికమక పట్టే ప్రయత్నం షకీల్వైపు నుంచి జరిగింది. ఆరు నెలల నుంచి విచారణ నడుస్తుండగా తప్పించుకోడానికి మాజీ ఎమ్మెల్యే శతవిధాలా ప్రయత్నించారు. తన రైస్‌మిల్లుల్లో టెక్నికల్ సమస్యలు వచ్చినందున తన వద్ద స్టాక్‌ను ఇతరులకు చెందిన మరో ఏడు రైస్‌మిల్స్‌కు మళ్లించినట్లు డిసెంబర్‌లో ఓ లెటర్‌ను సర్కారుకు పంపి డైవర్ట్ చేశారు. ఆయన చెప్పిన ఏడు రైస్‌మిల్స్‌కు వెళ్లి విచారణ చేపట్టగా తమకు ఏ ధాన్యం రాలేదని వారు స్టేట్మెంట్ఇచ్చారు. దీంతో షకీల్‌పై కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
సహకరించిన ఫలితమే ఇది
షకీల్ ఆధ్వర్యంలో వడ్లు మాయమైన ఉదంతంపై రెండు నెలల కిందటే విచారణ పూర్తయింది. నిజానిజాలు తేలినా పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ వల్ల గవర్నమెంట్ చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైంది. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా షకీల్ అవినీతికి అండగా ఉన్న ఇద్దరు ఆఫీసర్లు ఇప్పుడు బలి కావాల్సి వచ్చింది. గవర్నమెంట్ కొనుగోలు సెంటర్లకు షకీల్మనుషులు వచ్చి వందల సంఖ్యలో వడ్ల లారీలను మళ్లించుకుపోయినా నోరు తెరవకపోవడం, స్టాక్ అంతా సరిగ్గానే ఉందని రికార్డులు రాసిన ఫలితాన్ని డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్సస్పెన్షన్ రూపంలో అనుభవిస్తున్నారు. షకీల్‌కు అండగా ఉండి.. గత డిసెంబర్‌కు ముందు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయిన మరో ముఖ్య ఆఫీసర్పాత్రపైనా ఇంటెలిజెన్స్ రిపోర్టు రెడీ అవుతోంది.