ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న వైనం 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు పి. నారాయణస్వామి, ఏ. విష్ణులను సస్పెండ్‌‌‌‌ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి..  ఎస్సీ కార్పొరేషన్ నుంచి 9  మంది లబ్ధిదారులకు రూ.31 లక్షల 50 వేలు మంజూరు కాగా, వాటిలో మూడు లక్షల 50 వేలు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని తెలిపారు.  

నాగర్ కర్నూల్ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పి. నారాయణస్వామి సీనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తుండగా..   ఏ విష్ణు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.  వీరిద్దరూ ఫేక్ ఏజెన్సీలను సృష్టించి నిధులను మళ్లించి సొంత అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రభుత్వ నిధులను మళ్లించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.  నిధుల మళ్లింపుపై ఇద్దరు ఉద్యోగస్తులపై పోలీసు కేసు నమోదు చేసి వారికి సంబంధించిన అకౌంట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్ లాల్  తెలిపారు.  ఇద్దరు ఉద్యోగులపై ఎంక్వయిరీ అధికారిని నియమించినట్లు, మళ్లింపు నిధులను రికవరీ చేయనున్నట్లు రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.