బీజేపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు నాణేల సంచి..

బీజేపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు నాణేల సంచి..

ముంబైలో  బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇంటి బయట అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ బ్యాగ్ను ప్రసాద్ లాడ్ ఇంటి ముందు వదిలి పారిపోయాడు. బీజేపీ నాయకుడి ఇంటిముందు ఓ వ్యక్తి అనుమానంగా సంచరించడంతో  పోలీసులు అతని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు రావడాన్ని గమనించిన దుండగుడు..బ్యాగ్ ను అక్కడి విడిచిపెట్టి పారిపోయాడు. పోలీసులు బ్యాగ్ ను చెక్ చేయడంతో అందులో నాణేలు బయటపడ్డాయి. వెండి, బంగారు ఆభరణాలు, నగదుతో పాటు గణపతి విగ్రహం అందులో లభ్యమైంది. 

ఈ ఘ‌ట‌న‌పై ఎమ్మెల్సీ ప్రసాద్ ఆందోళ‌న పడ్డారు. ఉదయం 5 -6 గంటల మధ్యలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు అనుమానంగా వెళ్తున్నట్లు పోలీసులు గమనించారని తెలిపారు. పోలీసులు అతడి వద్దకు వెళ్లే లోపే దుండగుడు బ్యాగ్ ను వదిలి పారిపోయారని చెప్పారు.  ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.