జీహెచ్ఎంసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

జీహెచ్ఎంసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా: అనుమానాస్పద స్థితిలో జీహెచ్ఎంసీ ఉద్యోగి రంగారెడ్డి మృతి చెందిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రంగారెడ్డి అనే వ్యక్తికి జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిన్నటి నుండి కనిపించకుండా పోయాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ తెల్లవారుజామున జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతం వద్ద రంగా రెడ్డి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అతని శరీరంపై కత్తితో పొడిచిన గాయాలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు. ఉద్యోగి అయిన రంగారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అతన్ని ఎవరు హత్య చేసి ఉంటారు… శత్రువులెవరైనా ఉన్నారా..? ఎవరితోనైనా విభేదాలా.. ఉద్యోగ సమస్యలా అన్న వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన చివరిసారిగా మాట్లాడిన వారిని ప్రశ్నిస్తున్నారు. జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

for more News….

పాతబస్తీలో ఎంఐఎం కోటలు కదిలేనా?

ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్

గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే

సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్​ ఏజెంట్లు

కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​