
డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు.. త్వరలో ‘శ్వాగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ తర్వాత దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో అతను నటిస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. మంగళవారం మూవీ రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇచ్చారు. దసరాకి దాదాపు 10 రోజులు ముందుగా అక్టోబర్ 4న ‘శ్వాగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
పండుగ సెలవులు సినిమాకు కలిసి వస్తాయని టీమ్ చెబుతోంది. ఇందులో రీతూ వర్మ, దక్షా నగార్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.