
ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దీంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరుకుంది. మూడు కూడా కాంస్య పతకాలే కావడం విశేషం. అంతకముందు మహిళల సింగిల్స్ విభాగంలో మను భాకర్..కాంస్య పతకం సాధించగా.. మంగళవారం జరిగిన10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను–సరబ్‌జోత్ సింగ్ 16–10తో లీ వోనోహో–ఓ యె జిన్ (సౌత్ కొరియా)పై గెలిచారు.
బుధవారం (జూలై 31) క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే ఏడో స్థానంలో నిలిచి పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ ఫైనల్స్ గురువారం(ఆగస్టు 1) జరగగా.. స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం గెలుచుకున్నాడు. పుణెకు చెందిన స్వప్నిల్ కుసాలే ఒలింపిక్స్ చరిత్రలో పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 స్థానాల ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచాడు.
??? ?????? ??. ? ??? ?????! Many congratulations to Swapnil Kusale on winning India's third medal at the Paris 2024 Olympics!
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
? ?????? @sportwalkmedia ??? ????????? ???????? ?? ?????? ???????? ?? ??? ?????… pic.twitter.com/eokW7g6zAE