
మేడ్చల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే తన కూతురిని చంపేశాడని తెలియడంతో స్వాతి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్వాతి స్వంత గ్రామం వికారాబాద్ లోని కామారెడ్డి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కన్న కూతురు మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. గర్భిణీ అని చూడకుండా దారుణంగా హత్య చేసిన మహేందర్ రెడ్డి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిని నిందితుడు మహేందర్ రెడ్డి టార్చర్ చేసేవాడని మృతురాలి చిన్నమ్మ ఆరోపించింది. ఎవరు ఫోన్ చేసిన అనుమానించేవాడని తెలిపింది. ఇప్పటివరకు కూడా వారు ఎక్కడ ఉంటున్నారనేది అడ్రస్ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్పీకర్ పెట్టి మాట్లాడాలని ఆర్డర్ వేసేవాడని.. స్వాతి హింస పెట్టి చంపిన మహేందర్ రెడ్డిని కఠిన శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. ఇటీవల రాఖీ కట్టేందుకు మా యింటికి వచ్చిన స్వాతి తనతో బాధను చెప్పుకొని ఏడ్చిందని తెలిపింది. మహేందర్ రెడ్డి సైకోలా ప్రవర్తించేవాడని స్వాతి వాపోయిందని చెప్పింది. మహేందర్ రెడ్డి తమ అక్కను టార్చర్ చేసేవాడని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి స్వాతి మధ్య తరుచుగా గొడవలు జరిగాయని ఆమె సోదరుడు వాపోయాడు.
వికారాబాదడ్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి, అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 25 రోజులక్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీహిల్స్ లో అద్దెకు ఉంటున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ భార్యభర్తల మధ్య తరుచుగా గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు ముదురడంతో ఆదివారం స్వాతిని రంపంతో రెండు ముక్కలుగా కోసి చంపేశాడు భర్త మహేందర్ రెడ్డి. స్వాతిని ముక్కలుగా కట్ చేసిన శరీర భాగాలని రెండు బ్యాగులలో వేసుకొని ప్రతాప్ సింగారం ముసిలో పడేసినట్టు పోలీసుల విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.