నిఖిల్ హీరోగా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న క్రేజీ మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూపించారు. ఈ చిత్రం కోసం ఫాంటమ్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలో దాదాపు 750 మంది టెక్నీ షియన్స్ వర్క్ చేస్తున్నట్టు తెలియజేశారు.
ఈ సినిమాలో సుమారు 2700కిపైగా వీఎఫ్‌ఎక్స్ షాట్లు ఉంటాయని చెప్పడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ప్రతి సీజీ ఫ్రేమ్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ కేర్ తీసుకుంటోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. విజయ్ కామిశెట్టి డైలాగులు అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
