121 ఏళ్ల క్రితం ఉద్యమకారిణి మళ్ళీ పుట్టిందా..!

121 ఏళ్ల క్రితం ఉద్యమకారిణి మళ్ళీ పుట్టిందా..!

ఫొటోలు చూశారుగా.. ఇద్దరూ సేమ్​ టు సేమ్​ దిగిపోయారు కదూ! పెద్దలు చెప్పినట్టు మనిషికి పునర్జన్మ అనేది ఉంటుందో ఉండదో తెలియదుగానీ, ఇలాంటివి చూస్తుంటే మాత్రం వాళ్లు చెప్పింది నిజమే అనిపించకమానదు. బ్లాక్​ అండ్​ వైట్​ ఫొటోలో ఉన్న అమ్మాయి సేమ్​ టు సేమ్​ స్వీడన్​ క్లైమేట్​ యాక్టివిస్ట్​ గ్రెటా థన్​బర్గ్​లా ఉంది కదా. ఆ ఫొటోను 121 ఏళ్ల క్రితం 1898లో కెనడాలోని యుకోన్​ టెరిటరీలో తీశారట. యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్​ పిక్చర్​ ఆర్కైవ్స్​లో ఆ ఫొటో బయటపడడం, సోషల్​ మీడియాలో పెట్టడంతో వైరల్​ అయిపోయింది. నెటిజన్లు ఆ ఫొటోలను చూసి, ఇప్పుడు మనల్ని కాపాడడానికి గ్రెటా మళ్లీ పుట్టిందంటూ కామెంట్లు పెట్టారు. ఆమె టైమ్​ ట్రావెలర్​ అంటూ కొందరు కామెంట్​ చేశారు. మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. ఫొటోషాప్​ చేసి ఆ పాత ఫొటోను పెట్టారని అన్నారు. ఒకట్రెండు పోలికలైతే ఓకే గానీ, మరీ, అన్ని పోలికలు ఒకేలా ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు.