రక్షా బంధన్.. బంగారు పూతతో స్వీట్

రక్షా బంధన్.. బంగారు పూతతో స్వీట్

ర‌క్షా బంధన్… ప్రతీ ఏటా ఇదొక సంబరం, రోజూ ఉండే టెన్షన్ల మధ్య నుంచి తప్పుకొని తోడబుట్టిన వాళ్లని కలుసుకొని ఆనందంగా ఉండే రోజు. కోవిడ్ కారణంగా రక్షా బంధన్ వేడుకలను జరుపుకోలేదు. కానీ.. పరిస్థితిలో మార్పు వచ్చింది. అన్ని పండగలలాగానే రాఖీ పున్నమిని కూడా ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమౌతున్నారు. మార్కెట్ లో వివిధ రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా.. స్వీట్ల షాపులు కిటకిటలాడుతున్నాయి. రాజస్థాన్ లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు స్వీట్ల యజమానులు రకరకాల తీపి పదార్థాలను తయారు చేయిస్తున్నారు. నెయ్యి, పిండి, పంచదార పాకంతో తయారు చేసే Ghevar స్వీట్ ప్రసిద్ధి. శ్రావణమాసం, రక్షా బంధన్ పండుగ రోజున ఈ స్వీటును కొనుగోలు చేస్తుంటారు.

హర్యానా, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ స్వీటు పాపులర్. ఆగ్రాలోని ఓ స్వీట్ షాపులో ప్రత్యేకంగా  Ghevar స్వీట్ ను తయారు చేశారు. Gold Ghevar గా పిలుస్తున్నారు. 24 క్యారెట్ల బంగారు పూత పూసి తయారు చేశారు. కిలో స్వీటు రూ. 25 వేలుగా ఉంది.  Braj Rasayan Mitthan Bhandar వారు దీనిని తయారు చేయించారు. ఈ స్వీటును కొనుగోలు చేయడానికి వివిధ ప్రాంతాల వాళ్లు ఇక్కడకు వస్తున్నారు. స్వీటులో పిస్తా, బాదం, వేరు శనగ, వాట్ నట్ లు వాడుతామని, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయని స్వీటు యజమాని వెల్లడించారు తినే బంగారు టాపింగ్ తో పాటు ఐస్ క్రీం రుచి ఉంటుందన్నారు. ఈ స్వీటును ప్రత్యేక కవర్ లో ప్యాక్ చేస్తున్నారు.